కిషన్ రెడ్డి త‌లాతోకాలేని ప్యాకేజీతోటి పిచ్చి కత‌లా…

 

  • కిషన్ రెడ్డి త‌లాతోకాలేని ప్యాకేజీతోటి పిచ్చి కత‌లా…
  • లక్షలాది మంది వలస కూలీల ని చూసి మీ మనసు కరగలేదా…
  • ప్యాకేజీపై ఉన్నమాట అంటే అంత ఉలుకు ఎందుకు…
  • ఇప్పటికైనా మీ పెడ‌ బుద్ధిని మార్చుకోండి…
భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకాయ లేకుండా మాట్లాడుతున్నాడు. క‌రోనా వైర‌స్‌ సంక్షోభ సమయాల్లో పిచ్చి ప్యాకేజీ ప్రకటించి దానిని పరమాద్భుతం గా ప్రచారం చేస్తున్నాడు. ఇలాంటి కథలు ప‌డే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మట్టి కొట్టుకుపోయింది. అయినప్పటికీ ఆ పార్టీకి బుద్ధి రాలేక ఇలాంటి చిల్లర రాజకీయాలు దిగుతుంది.
పేరుకే 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్రాలకు పంచడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ ఉంది.  నిజానికి ఆ ప్యాకేజీ వల్ల ఊదు కాలేదు లేదు పీరే లేచేది లేదు అన్న చందంగా ఉంది. ఇలాంటి పిచ్చి ప్యాకేజీని చూసి ప్రజలంతా గొల్లుమని నవ్వుతున్నారు. ఇప్పటికే బిజెపి కి ఎందుకు ఓటు వేసావా భగవంతుడా అని తల బద్దలు కొట్టుకుంటున్నారు.
ఇంకా కరోనా వైరస్ ను అడ్డుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతగానితనాన్ని చూసి ప్రపంచం అంతా వ్యంగ్యంగా మాట్లాడుతుంది. ఆయనప్ప‌టికీ బుద్ధి తెచ్చుకో లేని ఈ ప్రభుత్వం పేరుకు మాత్రం గొప్పలు చెప్పకు ఉంటుంది.
కోట్లాది మంది వలస కూలీలు ఆహారం దొరకక నడుచుకుంటూ తమ స్వస్థలాలకు వెళుతున్నారు. అయినప్పటికీ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కేంద్ర‌ప్ర‌భుత్వ తీరు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో దానిని బంగాళాఖాతంలో కలపడం ఖాయం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నేతలు కాస్త‌ మానవత్వంతో వ్యవహరించాలి.