గుమ్మడికాయల దొంగలా భుజాలెందుకు తరుముకుంటున్నారు.

 

  • గుమ్మడికాయల దొంగలా భుజాలెందుకు తరుముకుంటున్నారు.
  • సీఎం కేసీఆర్ ఎవరినో విమర్శిస్తే.. మీకేం నొప్పి.
  • మీరెందుకు బాధ పడుతున్నారు.
  • అంటే మీరే వ్యతిరేఖ ప్రచారం చేస్తున్నారు, చేయిస్తున్నారా??.
  • ఏం భట్టి విక్రమార్క సీఎం మాటల మీద బాధ ఎందుకు?.

సీఎం  కేసీఆర్ ప్రెస్ మీట్ లో కొందరు రాజకీయ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని.. ఆపత్కాల సమయంలోనూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది అన్నది కూడా కేవలం మీడియాను మాత్రమే. పర్టిక్యులర్ గా ఒక పత్రిక.. డాక్టర్లకు రక్షణ లేదని.. పీపీఈ కిట్లు లేవని చిల్లర రాతలు రాస్తే.. ఇదా పద్దతని.. దరిద్రులు, సన్నాసులు అని ఆ పత్రికా యజమానిని.. ఆ రాతలు రాసిన జర్నలిస్టులను తిట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం.. సీఎం ఏదో తమనే విమర్శించినట్లు.. తమనుద్దేశించి అన్నట్లు ఫీల్ అవుతున్నారు. గుమ్మడికాయల దొంగ అంటే మీరెందుకు భుజాలు తరుముకుంటున్నారు భట్టి విక్రమార్క.

ప్రభుత్వానికి సహకరిస్తున్నారని మాట్లాడుతున్నారు. సహకరించక రాజకీయాలు చేస్తే.. జనమే చెప్పుతో కొడతారు జాగ్రత్త. అయినా.. ఓట్ల సమయంలో పోటీలు పడి డబ్బులు పంచుతారు కదా?. ఊహించని బహుమతులు పంచుతారు కదా?. మరి అదే ఓటర్లు ఇప్పుడు.. కష్టంలో ఉన్నారు. పేదలు తిండిలేక అలమటిస్తున్నారు. ప్రభుత్వం తరపున వారికి ఎంతోకొంత సాయం అందుతోంది. టీఆర్ఎస్ నేతలు కూడా వారి వారి నియోజకవర్గాల్లో పేదలకు సాయం  చేస్తున్నారు. మరి మీరేం చేస్తున్నారు. ఎంతమందికి సాయం చేశారు.. ఎంతమందిని ఆదుకున్నారు. భట్టి విక్రమార్క సర్కారుకు సహకరించడం అంటే.. నోటిమాటలు చెప్పడం కాదు. చేతల్లో చూపాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి.

ప్రతిపక్షాలను విమర్శించేంత తీరిక ప్రస్తుతం ముఖ్యమంత్రికి లేదు. ప్రజల్ని ఏ విధంగా రక్షించాలి, కరోనా నుంచి ఏ విధంగా తెలంగాణను బయటపడేయాలనేదే.. ఆలోచన చేస్తున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. పేషెంట్లను కంటికి రెప్పలా కాపాడుకుని..కోలుకునేలా చేస్తున్నారు. మర్కజ్ ఘటన లేకుంటే.. అసలీపాటికి రాష్ట్రంలో జీరో కేసులు ఉండేవి. కరోనా ఫ్రీ స్టేట్ అయ్యేది. కానీ.. మన ఖర్మ.. మర్కజ్ ఇష్యూ. ఇప్పటికే వారందరినీ క్వారంటైన్ చేసింది సర్కార్. ప్రభుత్వం ఓవైపు కరోనా కట్టడికి తీవ్రంగా కష్టపడుతుంటే.. మీ విమర్శలు ఏంటి భట్టి.