ఆరేళ్లలో వైద్యారోగ్యశాఖ ప్రక్షాళన.

 

  • ఆరేళ్లలో వైద్యారోగ్యశాఖ ప్రక్షాళన.
  • ప్రభుత్వం పెట్టిన ఎఫర్ట్స్ కు ఫలితం దక్కింది.
  • ప్రభుత్వ దవాఖానాలు బాగుపడ్డాయి.
  • 40వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రజలు..
  • ప్రభుత్వ దవాఖానాలకు వెళ్లేలా చేసింది సర్కార్.

ప్రభుత్వ దవాఖానాలంటే… ఒకప్పుడు.. నేనురాను బిడ్డో సర్కార్ దవాఖానకు అని పాటలు పాడుకునే వారు. కానీ.. నేడు కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా సకల సదుపాయాలు కల్పించడంతో.. పేద ప్రజలంతా సర్కార్ దవాఖానాకే పోతున్నారు. బస్తీ దవాఖానాలు తెచ్చి.. సిటీలోని పేదలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది ప్రభుత్వం. టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన తర్వాత.. ఆరేళ్లలో 40వేల కోట్లు ఖర్చు చేసి.. వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేసింది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఓపీని డబుల్ చేసింది. సిజేరియన్లకు కత్తెర వేసింది.

కేసీఆర్ కిట్,.. 12వేల సాయం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక పథకం. అందుకే ఈ పథకం తెచ్చిన తర్వాత.. గర్భిణీలు ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీకి క్యూ కట్టారు.  ప్రభుత్వాస్పత్రుల్లో పురుడుపోసుకుంటే మగబిడ్డ పుట్టినవారికి 12వేలు, ఆడబిడ్డ పుట్టిన వారికి 13వేల నగదును ప్రభుత్వం అందజేస్తోంది. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో  ప్రసవాలు 30 నుంచి 55 శాతానికి పెరిగాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా చేసే కడుపుకోతలు తగ్గాయి. ఐదేళ్ల క్రితం ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 39 మరణాలు ఉంటే.. అది 27కు తగ్గింది. ఉమ్మడి రాష్ట్రంలో బాలింతల మరణాలు ప్రతి లక్ష మందికి 92గా ఉంటే ఇప్పుడది 70కి తగ్గింది. గతంలో తెలంగాణ ప్రాంతంలో ఇమ్యూనైజేషన్‌ శాతం 68 ఉండగా అదిప్పుడు 92 శాతానికి చేరుకుంది.

ప్రభుత్వ చర్యలతో సర్కారు ఆస్పత్రుల్లో ఓపీ శాతం 30 నుంచి 40 శాతానికి పెరిగింది. కొత్త జిల్లాల్లోని ప్రతి కేంద్రంలో జిల్లా ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. దీంతో కొత్తగా 162  దవాఖానాల ఏర్పాటయ్యాయి. 40కిపైగా డయాలసిస్‌ కేంద్రాలు, 40 డయాగ్నస్టిక్స్‌ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. మందుల కొనుగోళ్లకు గతంలో 150 కోట్లు ఉండగా ప్రస్తుతం దాన్ని 400 కోట్లకు ప్రభుత్వం పెంచింది. కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్రంలోని 1.54 కోట్ల మందికి నేత్ర పరీక్షలు చేశారు. 50 లక్షల కళ్లద్దాలను పంపిణీ చేశారు. పదుల సంఖ్యలో హాస్పిటళ్లను మోడల్ ఆస్పత్రులుగా మార్చారు. చిల్డ్రన్ కేర్ కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలో 1500 పడకల టిమ్స్ ప్రారంభించారు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆరేళ్లలో వైద్యారోగ్యలో వచ్చిన మార్పులెన్నో ఉన్నాయి. తెలంగాణ వస్తే ఏమొస్తది.. అన్న మొహాల మీద తన్నినట్లు స్వరాష్ట్రంలో పాలన సాగుతుందని.. సగర్వంగా చెప్పగలం.