30రోజుల ప్రణాళికపై ప్రజాపక్షం అక్కసు.

 

  • 30రోజుల ప్రణాళికపై ప్రజాపక్షం అక్కసు.
  • 30 రోజుల తర్వాత ఏంటని పనికిమాలిన వార్తలు రాస్తోంది.
  • 30 రోజుల్లో గ్రామాలు బాగుపడ్డప్పుడు.. అదే కంటిన్యూ అవుతుంది.
  • రాష్ట్రం ఇచ్చే నిధులు 30 రోజులతోనే ఆగిపోవన్న విషయం..
  • ప్రజాపక్షం సన్నాసులకు ఎప్పుడు అర్థం అవుతుంది.

గ్రామాల అభివృద్ధికి నిధులు అనేవి ప్రతీ నెల కొనసాగుతూనే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. పన్నుల ఇతర రూపేనా.. గ్రామాలకు నిధులందుతూనే ఉంటాయి. వాటితో 30 రోజుల ప్రణాళికలో ఏమేం చేశారో అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. 30 రోజుల ప్రణాళిక తర్వాత గ్రామాల పరిస్థితి ఏంటని.. పనికిమాలిన హెడ్డింగులు పెట్టి.. పిచ్చి రాతలు రాసే వెర్రి పుల్కాల్లారా?. ముందు మీ ఆలోచన విధానం మార్చుకోండి. ప్రభుత్వం ఏదో.. ఈ ఐదేళ్ల నిధులన్నీ 30రోజులకే ఇస్తున్నట్లు.. ఆ తర్వాత అంతా ఏమీ ఉండవన్నట్లు మాట్లాడటం మంచి పద్దతి కాదు.

కడుపుకు అన్నం తినే వాళ్లకు ఇటువంటి డౌట్లు రావు. కేవలం ప్రభుత్వం మీద అక్కసుతోనే ఇటువంటి చెత్త వార్తలు రాస్తూ ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. జర్నలిజం అంటే ప్రజలకు పనికొచ్చే వార్తలు రాయాలి. కానీ పనికిమాలిన వార్తలతో ప్రజల్ని ఆగం చేయొద్దు. 30 రోజుల ప్రణాళికలో నాటిన మొక్కలు, చేసిన పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. నాటిన మొక్కలు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎవరు నీళ్లు పోసి పెంచకున్నా.. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ఎండాకాలం వరకు మొక్కలకు ఏమీ కాదు. ప్రజాపక్షం వాళ్ల మొసలి కన్నీళ్లు ఏమీ అవసరం లేదు.

30రోజుల ప్రణాళికను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసింది. ఫలితంగా వేలాది గ్రామాల్లో మార్పులు అనేవి స్పష్టంగా కనిపించాయి. పారిశుద్ధ్యం, మొక్కల పెంపకంతో పాటు.. ఆరుబయట మలమూత్ర విసర్జనను వందశాతం నిరోధించడం జరిగింది. ప్రభుత్వం అనుకున్న టార్గెట్ రీచ్ అయింది. తెలంగాణ పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ముందడుగు వేస్తున్నాయి. మంచి దృష్టితో చూస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. కానీ.. వక్రబుద్ధితో చూస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి.