సంజయ్​.. ముందు పెట్రోల్​ రేట్ల గురించి మాట్లాడు..

 

 

  • సంజయ్​.. ముందు పెట్రోల్​ రేట్ల గురించి మాట్లాడు..
  • వరుసగా పది రోజుల నుంచి ధరలు పెరుగుతున్నయ్​
  • వాటిని తగ్గించేలా ఉద్యమించు
  • అప్పుడే మిమ్మల్ని జనం నమ్ముతరు
  •  కరెంటు బిల్స్​పై దుష్ప్రచారం మాను
  • దేశాన్ని దోచుకుంటున్నది మీ పార్టీ

 

జనమంతా కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అందరి ఆదాయాలు పడిపోయాయి. లక్కీగా ఇదే సమయంలో ఇంటర్నేషనల్​లో బ్యారెల్​ క్రూడాయిల్​ ధర 35 డాలర్లకు పడిపోయింది. అంటే మనదేశంలో లీటరు పెట్రోల్​ను 40 రూపాయలకే అమ్మొచ్చు. ఇదే జరిగితే ప్రజలకు ఎంతో మేలు. కానీ మోడీ ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసా ? అక్కడ రేట్లు తగ్గినకొద్దీ ఇక్కడ ఎక్సైజ్​డ్యూటీ పెంచుతూ బరాబర్​ చేస్తున్నది. మరో ఘోరం ఏమిటంటే గత వరుసగా పది రోజుల నుంచి పెట్రోల్​ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అతి త్వరలో లీటరు పెట్రోల్​ ధర రూ.100కు చేరే అవకాశాలు ఉన్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో ప్రజలను ఇంతగా దోచుకున్న ప్రభుత్వం మరొకటి లేదు.

ఈ విషయంపై నోరుమెదపని బీజేపీ నాయకులు తెలంగాణలో మాత్రం కరెంటు రాజకీయాలకు తెరతీశారు. సోషల్​ డిస్టెన్స్​ రూల్స్​ పాటించకుండా కిరాయి కార్యకర్తలను వెంటేసుకొని బండి సంజయ్​, వివేక్​ వంటి వాళ్లపై రోడ్లపై పడ్డారు. ఇలాంటి దొంగ ఉద్యమాల వల్ల కరోనా కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అయినా బీజేపీ గ్యాంగ్​ పట్టించుకోవడం లేదు.  కరోనా కారణంగా  వరుసగా రెండు నెలలు మీటర్ రీడింగ్ తీయకపోవటంతో చార్జీలు  కొంత ఎక్కువ కనిపిస్తున్న మాట నిజమే కానీ ఈ విషయంలో ప్రభుత్వం మోసం చేస్తున్నదనే మాట అబద్ధం.  మనదేశంలో మార్చి, ఏప్రిల్‌‌‌‌ నెలల్లో తక్కువ కరెంట్ వాడి మే నెలలో ఎక్కువ వాడుతారు. ఎందుకంటే ఎండలు ఎక్కువ. దీనికితోడు వరుసగా రెండు నెలలు బిల్స్​ కట్టలేదు.

అందుకే బిల్లులు ఒకటి రెండు వందలు ఎక్కువ వస్తున్నాయి.  రెండు నెలల బిల్లును సరాసరి చేస్తే అది రూ.5 నుంచి లెక్కలోకి వస్తుంది. ఒక విధంగా చూస్తే తక్కువగానే ఉంటుంది. కొన్నిచోట్ల తప్పితే ఎక్కడా సమస్య లేదు. కరోనా ప్రభావంతో ఇప్పటికే రావాల్సిన చార్జీలు వసూలు కాక సంస్థలు ఇబ్బందిలో ఉన్నాయి. రూ.2,000 కోట్లు రావాల్సి ఉండగా రూ.800 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే సగం కూడా వసూలు కావడం లేదు. ఇక ఎక్కువ బిల్స్​ వచ్చాయి అంటే నమ్మేదెలా ? అంతేకాదు కొన్ని ఇండ్ల‌కు మైన‌స్ బిల్లులు కూడా వ‌చ్చాయి. వాస్తవాలు ఇలా ఉంటే బీజేపీ మాత్రం రోడ్ల మీదికి వచ్చి కరెంటు బిల్స్​ తగ్గించాలని ఉద్యమిస్తోంది. మరి గత పది రోజులుగా పెట్రో రేట్లు పెరుగుతున్నాయని ఎందుకంటే సంజయ్​ నుంచి సమాధానం రాదు. గ్యాస్​ ధరలు ఎందుకు పెంచుతున్నారంటే ఎవడూ ఆన్సర్​ చెప్పడు. పెట్రో ధరల పెరుగుదల వల్ల ఎకానమీ మరింత నాశనం అవుతుంది. అసలు విషయాన్ని పట్టించుకోకుండా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం ?