హుజూర్ నగర్ లో ప్రచారానికి రేవంత్ సిగ్గుపడాలి.

 

  • హుజూర్ నగర్ లో ప్రచారానికి రేవంత్ సిగ్గుపడాలి.
  • పద్మావతికి టికెట్ ఇవ్వనే వద్దని మాట్లాడి…
  • ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ప్రచారాని వెళ్తాడు.
  • హుజూర్ నగర్ ప్రజలు రేవంత్ మొహం మీదే ఊస్తారు.
  • టికెట్టే వద్దన్నోడు ప్రచారం చేస్తే జనం ఓట్లు వేస్తారా?

హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి అనే పోటుగాడు పోతడట. సొంత నియోజకవర్గంలో గెలవడం చేతకాని దద్దమ్మ.. వేరే వాళ్లను గెలిపిస్తడా?. రేవంత్ మొహం చూసి హుజూర్ నగర్ లో రెండొందల ఓట్లైనా పడే అవకాశం ఉందా?. పద్మావతికి టికెట్ ఇవ్వడాన్నే తీవ్రంగా వ్యతిరేకించిన మోతుబరి అసలు ఏ మొహం పెట్టుకుని ప్రచారానికి వెళ్తాడు. ఓట్లెయ్యమని ప్రజల్ని ఏ విధంగా అడుగుతాడు. సిగ్గుపడాలి రేవంత్.. కేంద్రానికి టికెట్ ఇవ్వొద్దని చెప్పి.. ఇప్పుడేమో.. పద్మావతి తరపున ప్రచారం చేస్తానని ఏమని ప్రచారం చేస్తావ్. నేను వద్దన్నా టికెట్ తెచ్చుకుంది. అందుకే ఓడించండనా?? గెలిపించడనా?.

వందమంది రేవంత్ లు వచ్చినా.. వేలమంది సైన్యాలు వేసుకుని వచ్చిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఎగిరిదే గులాబీజెండానే. ఉత్తమ్ ఇలాకాలో గెలిచి టీఆర్ఎస్ సత్తా ఏంటో నిరూపిస్తాం ఒక్క వారం ఓపిక పట్టండి. టీఆర్ఎస్ పనైపోయిందనే వారందరికీ చెంప చెళ్లుమనేలా తీర్పు రాబోతోంది. రేవంత్ ప్రచారానికి రావడం వల్ల కాంగ్రెస్ లు కీడు.. టీఆర్ఎస్ కు మేలు జరుగుతుంది. ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడిగా పద్మావరి పేరును అనౌన్స్ చేస్తే తనకు అధికారం లేదన్నట్లు మాట్లాడి.. రెండు మూడ్రోజులు రచ్చ చేసిండు రేవంత్. అటువంటి నాయకుడు ప్రచారం చేయడం వల్ల నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలంతా టీఆర్ఎస్ వైపు మళ్లే అవకాశం ఉంది.

రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రచారం చేయగానే పద్మావతి గెలుస్తుందని భ్రమల్లో బతుకుతున్నట్లున్నాడు. నీ భ్రమలు… కలలు హుజూర్ నగర్ ప్రజలు తొలగిస్తారు. టీఆర్ఎస్ ను బంపర్ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ నాయకులందరికీ కళ్లు తెరిపిస్తారు. ఒక్క వారం ఓపిక పట్టండి. ఉత్తమ్ అండ్ కో కు మిగిలేది శంకరగిరి మాన్యాలే. ఎంతమంది వచ్చి ప్రచారం చేసినా.. ప్రభుత్వంపై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా.. గెలిచేది సైదిరెడ్డే.