హద్దులు మీరుతున్న ఆర్టీసీ జేఏసీ.

 

  • హద్దులు మీరుతున్న ఆర్టీసీ జేఏసీ.
  • ముఖ్యమంత్రిపై మర్యాదతో మాట్లాడండి అశ్వత్థామరెడ్డి.
  • హింసకు కుట్ర చేస్తున్నారా?.. సిగ్గుండాలి ఈ మాటనడానికి.
  • కార్మికులను రెచ్చగొట్టి.. ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది నువ్వే.
  • అసలు ఆర్టీసీ జేఏసీ మీదనే హత్యాయత్నం కేసులు పెట్టాలి.

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. ఎన్టీఆర్ కంటే కేసీఆర్ మేధావా అని ప్రశ్నిస్తున్న అశ్వత్థామరెడ్డి.. ఎస్.. ఎన్టీఆర్ కంటే కేసీఆర్ మేధావే. ఆరు దశాబ్ధాలు ఎవ్వరూ సాధించలేని రాష్ట్రాన్ని సాధించారు. 60 ఏళ్లలో ఎవ్వరూ ఇవ్వని విధంగా ఆర్టీసీ వాళ్లకు 44శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. ఇందుకు ఎన్టీఆర్ కంటే గొప్ప వారా కాదా?. మీ సమస్యలు పరిష్కరించకుంటే.. రాజ్యాంగ సంక్షోభం వస్తుందా?. ఎన్టీఆర్ ప్రభుత్వంలా కూలిపోతుందా?. కేసీఆర్ ను దగ్గర నుంచి చూసిన వ్యక్తివి నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా అశ్వత్థామరెడ్డి. ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడిన పార్టీలు.. ఇవాళ కనీసం తమ వాయిస్ వినిపించే పరిస్థితి లేదు. రేపు నీ పరిస్థితి కూడా అంతే అవుతుంది అశ్వత్థామరెడ్డి.. మాటలు జాగ్రత్తగా రానివ్వు.

సమస్యల పరిష్కారానికి నెల రోజుల సమయం అడిగితే వినకుండా మూర్ఖంగా సమ్మె చేస్తున్నారు. పైగా హింస చేయడానికి కుట్రలు చేస్తున్నారని మాట్లాడుతున్నావ్. కార్మికుల మీద కుట్రలు చేయాలని చూస్తే.. అసలు మీకు 44శాతం ఫిట్ మెంట్ ఇచ్చే వారే కాదు. రెండు వారాలుగా బస్సులు తిరగకుండా చేసినందుకు కార్మికులను జైళ్లలో పెట్టేవారు. కుట్రలంటే ఇలా ఉంటాయి. కానీ.. ప్రభుత్వం ఎక్కడైనా.. అరెస్ట్ లు చేసిందా?. తెలంగాణ ఏర్పడిన తర్వాత కోరినన్ని ఇచ్చింది కదా?. నాలుగేళ్ల తర్వాత జీతాలు పెంచాలని.. ప్రభుత్వంలో విలీనం చేయాలని గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా గమనించాలి కదా?.

హింస చేసి మీ సమ్మెను విచ్ఛిన్నం చేయాలనుకుంటే ప్రభుత్వానికి ఒక లెక్కనా?. అలా చేస్తే 14రోజులుగా మీరు సమ్మెలో ఉండేవారా?. ముఖ్యమంత్రిని దించేసే శక్తి రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు. అశ్వత్థామరెడ్డి కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. రేపు చర్చలు జరిపి.. సఫలం అయ్యి.. మళ్లీ విధుల్లోకి వస్తే.. ఇదే ప్రభుత్వం, ఇదే కేసీఆర్ కింద మీరు పనిచేయాల్సి ఉంటుంది. మీరు ఔనన్నా, కాదన్నా.. కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. సో గౌరవంగా మాట్లాడటం నేర్చుకోండి. ప్రతిపక్షాల మాటలు విని ప్రభుత్వానికి ఎదురు తిరిగితే.. తర్వాత ఇబ్బంది పడేది నువ్వే అశ్వత్థామరెడ్డి.