సమ్మెను సమర్థించడం సిగ్గుచేటు.

 

  • సమ్మెను సమర్థించడం సిగ్గుచేటు.
  • ఆర్టీసీ కార్మికుని కొడుకు పేరుతో సర్క్యూలేట్ అవుతున్న…
  • వార్తలు అసంబద్ధమైనవి.. అసత్యమైనవి.
  • కార్మికుల సమ్మెను సమర్థించుకోవడం సిగ్గుచేటు.
  • తెలంగాణలో అతిపెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా రోజు..
  • మీ గొంతెమ్మ కోర్కెలు నెరవేర్చాలనడం తప్పు?.

ఆర్టీసీ కార్మికుల కొడుకు పేరుతో ఓ వార్త సర్య్యూలేట్ అవుతోంది. ఇందులో ఆర్టీసీ కార్మికుల శ్రమ ఎంతో ఉందని.. ప్రభుత్వం ఇచ్చేది మాత్రం తక్కువ ఉందని ప్రచారం చేస్తున్నారు. కానీ.. దేశంలో ఏ ఆర్టీసీ కార్మికులకు అయినా స్టిల్ ఇప్పటికీ 44శాతం ఫిట్ మెంట్ ఉందా?. 16శాతం ఐఆర్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా?. పోనీ.. డ్రైవర్, కండక్టర్ల జీతాలు తెలంగాణ కంటే దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా?. ముందు వీటికి సమాధానం చెప్పండి. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొనలేదని ఎవ్వరూ అనలేదు. అందుకు ప్రతిఫలంగానే సీఎం కేసీఆర్… కార్మికులు అడిగినదానికంటే ఎక్కువే ఫిట్ మెంట్ ఇచ్చారు. అప్పులు తగ్గించేందుకు.. జీహెచ్ఎంసీతో పాటు.. రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా నిధులు ఇచ్చారు.

గత ప్రభుత్వాలు ఎప్పుడైనా బడ్జెట్ నుంచి పది పైసలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా?. జీహెచ్ఎంసీ నుంచి సాయం అందించే పరిస్థితి గత ప్రభుత్వాలు ఏనాడైనా చేశాయా?. గత ప్రభుత్వాలు.. దేశంలో ఏ రాష్ట్రం తీసుకోని జేఎన్ఎంయూఆర్ఎం బస్సులు తీసుకొచ్చి మన ఆర్టీసీకి నష్టాలు తెచ్చాయి. సీఎం కేసీఆర్.. మినీ బస్సులు.. ఏసీ బస్సులు తీసుకురావడంతో పాటు.. బస్టాండ్లు, షెల్టర్లు ఆధునీకరణ చేసి ప్రయాణికుల్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు. తద్వారా ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది నిజం. 44శాతం ఫిట్ మెంట్ ప్రకటించిన రోజు.. సంస్థ లాభాల్లోకి వచ్చే వరకు ప్రతీ ఒక్కరు ఒక గంట డ్యూటీ అదనంగా చేస్తామని హామీలిచ్చారు. ఒక్కళ్లైనా పది నిమిషాలు ఎక్కువ డ్యూటీ చేస్తున్నారా?.

ఆర్టీసీని విలీనం చేస్తామని సీఎం కేసీఆర్ ఎక్కడ చెప్పారో నిరూపించలేరు. పోనీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఉందా అంటే లేదు. పక్క రాష్ట్రంలో చేశారు కాబట్టి ఇక్కడా చేయాలనడం ఎంత దుర్మార్గం. పక్క రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చాలీ చాలని జీతాలతో పస్తులుంటుంటే.. మీరంతా పరమాన్నాలు తినేలా చేశారు సీఎం. మరి ఇదెందుకు మర్చిపోతున్నారు. ఒక్క నెల సమయం కావాలని అడిగితే మొండి పట్టుకుపోయి.. అమాయికులైన కార్మికులను రెచ్చగొట్టి.. బలిదానాల కాడికి తీసుకొచ్చారు. ఆర్టీసీ కార్మికుడి మృతికి  ప్రభుత్వం కాదు.. ముమ్మాటికీ ఆర్టీసీ జేఏసీయే కారణం. సమ్మె ముమ్మాటికీ న్యాయమైనది కానే కాదు. పండుగల పూట గొంతెమ్మ కోర్కెలు తీర్చాలని పట్టుబట్టడంతోనే ముఖ్యమంత్రికి కోపం వచ్చింది. నెల రోజులు సమయం అడిగినా.. వినకుండా మొండికేశారు. చివరికి కార్మికుల చావులకు కారణం అవుతున్నారు.