వడ్డీ మాఫీపై తప్పుడు రాతలు.

 

  • వడ్డీ మాఫీపై తప్పుడు రాతలు.
  • ప్రభుత్వం వడ్డీ చెల్లింపులు చేస్తూనే ఉంది.
  • కేంద్రం వడ్డీ మాఫీకి నిధులు ఇవ్వకపోయినా..
  • రాష్ట్ర ప్రభుత్వమే భరించి వడ్డీలు, రుణాలు మాఫీ చేసింది.
  • గత టర్మ్ లో 17వేల కోట్లు రుణమాఫీ చేసింది నిజం కాదా?.

రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మాఫీ చెల్లిస్తున్నా.. తప్పుడు రాతలు రాస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక తన వక్రబుద్ధి చూపిస్తుంది. పావలా వడ్డీ చెల్లించడం లేదని పిచ్చి రాతలు రాస్తూ రైతుల్ని తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. కానీ.. రాష్ట్రంలో ఏ ఒక్కరైనా వడ్డీలు చెల్లించారేమో ఆధారాలు నిరూపిస్తే బాగుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏ రైతు బ్యాంకులో వడ్డీలు చెల్లించిన పరిస్థితి లేదు. ఎందుకంటే.. గతంలో చెప్పిన విధంగా రుణమాఫీతో పాటు వడ్డీలు కూడా ప్రభుత్వమే చెల్లించింది. దీనిద్వారా 50 లక్షల రైతు కుటుంబాలు లబ్దిపొందాయి అన్నది వాస్తవం.

ప్రభుత్వం పంట రుణాలకు ఇప్పటికీ వడ్డీ చెల్లిస్తూనే ఉంది. కానీ.. 805 కోట్ల బకాయిలు ఉన్నాయంటూ రైతుల్ని భయబ్రాంతులకు గురి చేసేలా పిచ్చి రాతలేంది రాధాకృష్ణ. కేవలం ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాల్నని.. ప్రజలు అసహ్యించుకోవాలని పిచ్చి రాతలు రాస్తున్నావ్. మీ చంద్రబాబు.. రైతు రుణమాఫీని అటకెక్కిస్తే.. మారు మాట్లాడని నువ్వు… 17వేల కోట్ల రుణమాఫీని దిగ్విజయంగా పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వంపై పనికిమాలిన రాతలు రాస్తున్నావ్. చేతనైతే.. మీ ఏపీ ప్రభుత్వం మీద రాసుకో. మా జోలికి ఎందుకు వస్తున్నావ్…

కేంద్రం సాయం చేయకున్నా రుణమాఫీ చేసింది ప్రభుత్వం. కేంద్రం 4శాతం వడ్డీ మాఫీకి నిధులివ్వాలి. కానీ.. ఆ నిధులను మోడీ సర్కార్ వచ్చిన తర్వాత.. సరిగా అమలు చేయడం లేదు .అంతేకాదు.. కేంద్రం అమలు చేసే చాలా పథకాల్లోనూ మోడీ ప్రభుత్వం కోత పెట్టింది. ఉన్నత వర్గాలకు దోచి పెడుతూ.. పేదల్ని మరింత పేదరికంలోకి నెట్టేలా కేంద్రం చర్యలున్నాయి. అయినా.. అవన్నీ తట్టుకుని.. కేంద్రం నుంచి రావాల్సినవి కూడా రాష్ట్రమే భరిస్తూ వస్తోంది. ఈ విషయం మీకు తెలియదా?. కానీ.. రాష్ట్రం మీద బురద జల్లాలని ఇలా ఆధారాల్లేని వార్తలు రాస్తున్నావ్. రాధాకృష్ణ నీ పైత్యం మా దగ్గర పనికిరాదు. ఏపీలో చూపెట్టుకో.