యూనియన్లు, పార్టీలే కార్మికుల్ని రోడ్డున పడేశాయి రేవంత్.

 

  • యూనియన్లు, పార్టీలే కార్మికుల్ని రోడ్డున పడేశాయి రేవంత్.
  • ఆర్టీసీ కార్మికుల్ని అడ్డం పెట్టుకుని రాజీకాయాలా?.
  • టీఆర్ఎస్ ను డైరెక్ట్ గా ఎదిరించే దమ్ము విపక్షాలకు లేదు.
  • అందుకే ఆర్టీసీ కార్మికుల్ని ముందు పెట్టి.. వెనకుండి రెచ్చగొడుతున్నారు.

వేలాదిమంది కార్మికుల ఉద్యోగాలు పోయి రోడ్డున పడటానికి మొదటి కారణం.. యూనియన్ నాయకులు. కేవలం తమ మూర్ఖత్వంలో వేలాది  కుటుంబాల్ని రోడ్డున పడేశారు. ప్రతిపక్షాల అండ చూసుకుని.. మూర్ఖంగా సమ్మెకు వెళ్లారు. సమ్మెతో ఏదైనా సాధించవచ్చనుకుని చివరికి తమ జీవితాల్ని బలిపెట్టారు. ప్రభుత్వాన్ని బెదిరించి పనులు చేయించుకోవాలనుకుంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో ఆర్టీసీ యూనియన్ నేతలకు ఇప్పటికైనా అర్థం అయి ఉంటుంది. కేవలం యూనియన్ నాయకుడికి ఒక నామినేటెడ్ పదవి ఇవ్వలేదన్న దురుద్దేశంతో వేలాది మందితో సమ్మె చేయిస్తుండు.

కార్మికులను ముందు పెట్టి… వెనకుండి కాంగ్రెస్, బీజేపీ వాళ్లు రాజకీయాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ను డైరెక్ట్ గా ఎదిరించే దమ్ములేక.. ముండ మోపి రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు సిగ్గుపడాలి. ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇచ్చి.. వాళ్లు కోరినట్లు ప్రభుత్వంలో విలీనం చేయాలని అంటున్నారు. మరి కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న చోట అలా ఎందుకు చెయ్యరు?. మీరు పాలించే దగ్గర ఒకలా?. అధికారం లేని చోట ఇంకోలా ఎందుకు కోరుతున్నారు.

దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇలాగే ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారా?. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు దేశంలో కంటే ఎక్కువ జీతాలు వస్తుంది నిజం కాదా?. తిన్నదరక్క చేసే సమ్మెలకు ప్రతిపక్షాలు మద్దతు తెలపడం.. అండగా ఉంటామని పనికిమాలిన మాటలు చెప్పడం. అది చూసుకుని వెనకాముందు ఆలోచించకుండా ఆర్టీసీ యూనియన్ నేతలు.. సమ్మెకు వెళ్లి అమాయకుల ఉద్యోగాలు పోయేందుకు కారణమయ్యారు. థూ ఇప్పటికైనా మీ మూర్ఖత్వం వీడండి. సమ్మెను విరమించుకోండి.