మాదిగ‌ల ద్రోహి మాయ‌మాట‌లు!

 

మాదిగ‌ల ద్రోహి మాయ‌మాట‌లు!
కేసీఆర్‌ను ద‌ళితుల‌కు దూరం చేసే కుట్ర‌

కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌, మ‌హాద‌ళిత నాయ‌కుడు మంద‌కృష్ణ మాదిగ నిద్ర‌లేచాడు. కేసీఆర్ గురించి మ‌రోసారి కుక్క మొరిగిన‌ట్టు మొరిగాడు. మాదిగలను కేబినెట్‌లోకి తీసుకోనందుకు నిరసనగా వారంపాటు అంబేద్కర్‌ విగ్రహాల ఎదుట నిరసన తెలుపుతామని బ్లాక్‌మెయిల్ రాజ‌కీయాలు మొద‌లుపెట్టాడు.

కృష్ణా!! ఎస్సీల్లో మాదిగ‌లు స‌హా దాదాపు 70 ఉప‌కులాలు ఉన్నాయి. వీటిలో కొన్ని కులాలైతే మాదిగ‌ల‌కంటే వెనుక‌బ‌డి ఉన్నాయి. రెల్లి, మాట్టె, దొమ్మ‌రి కుల‌స్తుల జీవితాలు ఇప్ప‌టికీ దారుణంగా ఉన్నాయి. నువ్వేమో నోరుదెరిస్తే మాదిగ‌ల పాట పాడుతవు. ఎస్సీ కులాల‌న్నింటినీ మంత్రి ప‌ద‌వులు ఇచ్చుకుంటూ పోవాలంటే కేసీఆర్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేయాలి. లేదంటే ఒక్కో శాఖ‌కు న‌లుగురు ఐదుగురు మంత్రుల‌ను అయినా పెట్టాలి.

ఇదెలా సాధ్య‌మో చెప్పు. ప్ర‌భుత్వంలో ద‌ళితుల‌కు స్థానం లేకుంటే నిర‌స‌న తెలుపు త‌ప్పులేదు కానీ మాదిగోడికి క‌చ్చితంగా సీటియ్యాల‌ని లొల్లి జేస్తే ఎట్ల బిడ్డా ? ఎస్సీల‌కు న్యాయం చేయ‌డం మ‌న ల‌క్ష్యం కావాలి వారిని విడ‌దీసే రాజ‌కీయాలు కాదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు ఏర్పాటు అయిన‌ప్పుడు మాత్రం ఎస్సీల గురించి నోరెత్తిక‌పోతివి. కేసీఆర్ ద‌ళితుల‌ను ఏకంగా డిప్యూటీ సీఎంల‌ను చేశాడు. ఇక నిన్ను కాంగ్రెస్ ఏజెంట్ అన‌కుంటే ఇంకేమ‌ని పిల‌వాలె ? నీ పుణ్య‌మాని అని మాదిగ‌లంతా ఇత‌ర ఎస్సీ కులాల‌కు దూర‌మ‌వుతున్నారు. నిన్ను మించిన ద‌ళిత‌ద్రోహి ఎవ‌రూ లేరు. నీ గొప్ప‌ద‌నం అదే!