బీసీలకు 65 శాతం రిజర్వేషన్లు ఎలా సాధ్యం ?

 

  • బీసీలకు 65 శాతం రిజర్వేషన్లు ఎలా సాధ్యం ?
  • నోరుంది క‌దాని ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడుతున్న జీవ‌న్ రెడ్డి
  • రిజ‌ర్వేష‌న్ల పెంపు అసాధ్య‌మ‌నీ తెలిసీ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు

 

శాస‌న‌మండ‌లిలో ఏం అంశంపై చ‌ర్చ జ‌రిగినా కాంగ్రెస్‌, బీజేపీ గాయ్ గాయ్ చేస్తున్నాయి. ప్ర‌భుత్వాన్ని ఎలాగైనా విమ‌ర్శించాల‌నే దూల‌తో ఏదో సాకును వెతుకుతున్నాయి. కోడి గుడ్డు మీద ఈక‌లు పీకుతున్నాయి. మండ‌లిలో మున్సిప‌ల్ రిజ‌ర్వేష‌న్ల‌పై జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా కాంగ్రెస్ స‌భ్యుడు జీవ‌న్ రెడ్డి ఇలాగే త‌లాతోకా లేకుండా మాట్లాడాడు. బీసీల జనాభా 50 శాతం పైగానే ఉందని, బీసీలో చేర్చిన మైనార్టీలను కలుపుకుంటే 64 శాతానికి పెరిగిన బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాల‌ని మొండిప‌ట్టు ప‌ట్టాడు. ఏ ర‌కంగా చూసినా ఆయ‌న ప్ర‌తిపాద‌న అమ‌లు సాధ్యం కాదు. ఎందుకంటే బీసీల‌కు 65 శాతం రిజ‌ర్వేష‌న్లు, మిగ‌తా కులాల‌కు దామాషా ప‌ద్ధ‌తిన రిజ‌ర్వేష‌న్లు ఇస్తే 100 శాతం స్థానాల‌కు రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాలి. అస‌లు జ‌న‌ర‌ల్ అనే కేట‌గిరీయే ఉండ‌దు.

మ‌హిళా కోటా కూడా ఉండ‌దు. స్థానిక సంస్థల్లోనూ రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలు మున్సిపాలిటీల్లోని పదవులకూ వర్తిస్తాయి. దీంతో రాష్ట్రంలోని మున్సిపల్‌ చైర్మన్‌, వార్డు పదవుల్లో 50ు మేరకు రిజర్వేషన్‌ కేటగిరీలోకి వెళ్లనున్నాయి. మిగిలిన వాటిని జనరల్‌ కేటగిరీగా పరిగణిస్తారు. ఇక, అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు సగం స్థానాలను కేటాయిస్తారు.  బీసీల కు 33 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు కల్పిస్తూ 2009లో మున్సిపల్‌ చట్టాలను సవరించారు. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా మేరకు కోటా కేటాయించారు. దీంతో 2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతానికి పైగానే అమలయ్యాయి.

కానీ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేయాల్సి ఉంటుంది. తొలుత ఎస్టీలకు, ఆ తరువాత ఎస్సీలకు వారి జనాభా మేరకు సీట్లు కేటాయించాకే మిగిలినవి బీసీలకు కేటాయించా లి. అయితే రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఎస్టీ, ఎస్సీలు కలిపి 20ుకు పైగానే ఉంటారని అంచనా. దీంతో బీసీల కోటా అనివార్యంగా త‌గ్గుతుంది.  అయి తే గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో ఎస్టీ, ఎస్సీల జనాభా తక్కువగా ఉంటుందని, అందుకే పంచాయతీరాజ్‌ సంస్థలతో పోల్చితే బీసీలకు మెరుగ్గా రిజర్వేషన్లు దక్కుతాయని కూడా అంచనా వేస్తున్నారు.