బిజెపి బలపడింది వెలుగు పత్రికలోనే తప్ప తెలంగాణలో కాదు…

 

  • ఆర్టీసీ సమ్మెను రాజకీయం చేస్తూ వాపును చూసి బలుపు అనుకుంటున్న బిజెపి…
  • ఉద్యోగుల సమ్మెను రాజకీయం చేస్తూ బిజెపి బలపడిందని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న భాజపా..
  • బిజెపి బలపడింది వెలుగు పత్రికలోనే తప్ప తెలంగాణలో కాదు…
  • ఇప్పటికైనా ప్రజ ప్రయోజనాలకు పనిచేస్తే మంచిది…

అమాయకులైన ఆర్టీసీ కార్మికులను తమ స్వార్థం కోసం ఆత్మహత్యలను ప్రోత్సహిస్తూ రాజకీయాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ సిగ్గులేకుండా తెలంగాణలో బలపడిందని సొంత డబ్బా కొట్టించుకుంది.ఆర్టీసీ సమ్మె ను రాజకీయం చేస్తున్న బిజెపి వాపును చూసి బలుపు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.నిజానికి అసెంబ్లీ లో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న బిజెపి బలపడింది బీజేపీ నాయకత్వం నడిపిస్తున్న వెలుగు పత్రిక లోనే తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాదని తెలంగాణ  స్పష్టం చేస్తున్నారు.కార్మిక శాఖ లో ఉన్నప్పుడు కార్మికుల కష్టాలు తెలుసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులకు మొదటి నుంచి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 44 శాతం ఫిట్మెంట్ తో పాటు వారికి ఉదారంగా జీతాన్ని  సమకూర్చడం జరిగింది. ఆయినా కూడా  ఆర్టీసీ సంఘాలు  అనవసరంగా సమ్మె చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దేశంలోనే ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు సరైన ప్రొత్సహకాలు అందిస్తూ అండగా ఉంది. అయినా కూడా ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు స్తంభింపజేసి ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని అనుకుంటున్నాం అని  భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ సంఘాలు అనవసరంగా ఆర్టీసీ సమ్మె చేస్తున్నారు. దీని వల్ల నష్టపోయేది తెలంగాణ ప్రజలు ఆర్టీసీ కార్మికులు తప్ప ఇంకా ఎవరు లేరు అన్నది నగ్నసత్యం.ఆర్ టి సి వాళ్ళు చేస్తున్న సమ్మె కేవలం భారతీయ జనతా పార్టీ రాజకీయ లబ్ధి కోసం తప్ప మరొకటి కాదు అని వెలుగు పత్రిక సాక్షిగా నిజాలు బయటపడడం జరిగింది. రాష్ట్ర ప్రజల హక్కులను చిన్నాభిన్నం చేసి ఎలాగైనా పాగా వేయాలని అనుకుంటున్నా బిజెపికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.