ప్రజల్లో ఆదరణ లేని ఆర్టీసీ సమ్మె కోసం ఎందుకంత ఆత్రుత. 

 

సమ్మె ఎంత ఉధృతంగా ఉంటే క్రమశిక్షణ చర్యలు అంత తీవ్రంగా ఉంటాయి.
ప్రజల్లో ఆదరణ లేని ఆర్టీసీ సమ్మె కోసం ఎందుకంత ఆత్రుత.
ప్రజలకు ఇన్ని కష్టాలు తెస్తున్న ఆర్టీసీ సమ్మెతో ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆత్మ కూడా క్షోభిస్తుంది.
ప్రజలను ఎన్నో కష్టాలకు గురిచేస్తూ ఇసుమంతైనా మద్దతు లేకున్నా, ఆర్టీసి సంఘాలు మరియు ప్రతిపక్షాల ప్రోద్బలంతో నిర్వహిస్తున్న ఆర్టీసీ సమ్మె ఇంకా ఉధృతం చేస్తామని ఆర్టీసి సంఘాలు చెప్పడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సంక్షేమం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు 1000 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసినా కూడా ఇంకా గొంతెమ్మ కోరికలు కోరడం ఏంటి అని ఆర్టీసీ సంఘాలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నిరంతరం ఆర్టీసీ సంక్షేమాన్ని కోరుతూ వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఇంకా సమ్మె ఉధృతం చేస్తామని సిగ్గులేకుండా చెబుతున్న ఆర్టీసీ సంఘాల పై ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ ప్రజలు గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని గట్టిగా కోరుతున్నారు.ఆప్యాయతతో ఆపన్నహస్తం అందించినా కూడా ఆర్టీసి సంఘాలు ఇంకా పొగరుబోతు ధోరణిలో ఉంటూ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉద్యమం ఉధృతం చేస్తున్నామని చెప్తున్న ఆర్టీసీ సంఘాలకు అసలు ప్రజల్లో ఆదరణ లేదు అయిన కూడా ఇంత ఆత్రుత ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదు అని విశ్లేషకులు అనుకుంటున్నారు. సమ్మె పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతూ  దాని కోసం ఇంకా ప్రొఫెసర్ జయశంకర్ గారికి నివాళులు అర్పిస్తున్నామని చెబుతూ ,ప్రజలకు కష్టాలు కలిగిస్తున్న ఆర్టీసీ సంఘాల తీరును చూసి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆత్మ కూడా క్షోభిస్తుంది అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట వదిలి విధుల్లో తిరిగి నిర్వహిస్తే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్నారు.