పోస్ట్ మార్చినా బుద్ధి మారలే.

 

  • పోస్ట్ మార్చినా బుద్ధి మారలే.
  • వీకే సింగ్ కు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు.
  • తిండి పెట్టే డిపార్ట్ మెంట్ పైనే ఆరోపణలు చేస్తున్నాడు.
  • పోలీసు వ్యవస్థను వేలెత్తి చూపుతూ పనికిమాలిన విమర్శలు చేస్తున్నాడు.

పోలీస్ అకాడమీ డైరెక్టర్ హోదాలో ఉండి.. పోలీస్ అకాడమీలు డంపింగ్ యార్డులు అంటున్న వీకే సింగ్ ను అర్జెంటుగా తీసుకెళ్లి ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించడం బెటర్. పోలీసులు వేస్ట్ అంటూ మాట్లాడుతున్న ఇటువంటి వ్యక్తిని ఇంకా డిపార్ట్ మెంట్ లో కొనసాగించడమే నేరం. డీజీపీ అర్జెంటుగా వీకే సింగ్ కు లాంగ్ లీవ్ ఇప్పించి పంపితే బెటర్. దేశంలో తెలంగాణ పోలీస్ అకాడమీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశంలోని ఎంతో మంది ఐపీఎస్ లు మన హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన వారే. ఇక్కడ శిక్షణ కోసం దేశం నుంచి పోటీ పడుతారు. అటువంటి శిక్షణా కేంద్రాన్ని డంపింగ్ యార్డ్ అనడానికి నోరెలా వచ్చింది వీకే సింగ్?. అది నోరా మూసీ మోరా?.

కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ.. ఫారెన్ కంట్రీస్ లో మాదిరిగా తయారైంది. ప్రజలకు భద్రత, భరోసా ఇవ్వడంతో పాటు.. వర్షాలు, వరదల సమయంలో ఎంతో హెల్ప్ ఫుల్ గా నిలుస్తున్నారు పోలీసులు. అసాంఘీక కార్యకలాపాలు వందశాతం తగ్గించగలిగారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అరాచకాలు, హెరాస్ మెంట్లు రాష్ట్రంలో లేనే లేవు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థతో ప్రజలకు ఎంతో దగ్గర అయ్యారు పోలీసులు. డబ్బున్న వాళ్లకే కాదు.. పేద ప్రజలకు సైతం ఎంతో సేవ చేస్తున్నారు. దేశంలో కంటే.. తెలంగాణలోనే పోలీసులు బాధ్యతగా పనిచేస్తున్నారు. జవాబుదారీ తనంతో తమ వృత్తిని నెరవేరుస్తున్నారు.

ఎవరో ఒక్కరు తప్పు చేశారని.. మొత్తం పోలీస్ వ్యవస్థనే తప్పు పట్టడం కరెక్ట్ కాదు. వీకే సింగ్ కు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. అర్జెంటుగా అతడ్ని విధుల నుంచి తొలగించాలి. లేకపోతే.. శిక్షణ తీసుకునే వాళ్లకు ఇబ్బందిగా మారుతుంది. జైళ్లశాఖ డీజీగా ఆగమాగం చేస్తున్నాడనే కారణంతో.. ఆ పదవి నుంచి వీకే సింగ్ ను తప్పించారు. అయినా తన బుద్ధి మార్చుకోకుండా.. ఏకంగా పోలీస్ అకాడమీల మీదనే..ఆరోపణలు చేస్తున్నందుకు వీకే సింగ్ ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బాధ్యతల నుంచి తప్పించాలని ప్రజల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి.