పవన్ కళ్యాణ్ మొసలి కన్నీళ్లు అవసరం లేదు.

 

  • పవన్ కళ్యాణ్ మొసలి కన్నీళ్లు అవసరం లేదు.
  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే జీర్ణించుకోలేని మహానటుడు..
  • ఇవాళ ఆర్టీసీ కార్మికుడి మృతిపై మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడు.
  • నీ ప్రేమ ఏదైనా ఉంటే.. నువ్వు సపోర్ట్ చేసిన బీజేపీని నిలదియ్.
  • ఆర్టీసీ కార్మికుల్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదుకోమని డిమాండ్ చేయ్.

ఆర్టీసీ కార్మికుడు మృతిపై పవన్ కళ్యాణ్ తెగ బాధపడిపోతున్నారు. మరి 1200మంది చనిపోతే తెలంగాణ వచ్చింది. వాళ్ల బాధను,. వాళ్ల ఆవేదనను అర్థం చేసుకోకుండా.. తెలంగాణ ఏర్పడినందుకు పదిరోజులు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు అని మాట్లాడావు కదా?. తెలంగాణ గడ్డ మీద ఉంటే ఒకలా.. ఆంధ్రాకి వెళ్తే మరోలా మాట్లాడే ఊసరవెళ్లి నువ్వు నీతులు చెప్తే వినేటోళ్లు ఎవ్వరూ లేరు. పూటకో మాట.. బోర్ కొట్టినప్పుడల్లా పెళ్లాల్ని మార్చే సత్య హరిశ్చంద్ర.. నీ మొసలి కన్నీళ్లు ఆర్టీసీ కార్మికులకు ఏమీ అవసరం లేదు.

ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారంలో కేంద్రం పాత్ర కూడా ఉంది. గతంలో నువ్వు కేంద్రానికి సపోర్ట్ చేసి.. మోడీని,. మీ భజనబాబును అధికారంలోకి తీసుకొచ్చావ్. ఆ చనువుతో ఇప్పుడు ప్రధాని దగ్గరకు వెళ్లి.. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్ని ఆదుకోండని.. తెలంగాణ ప్రభుత్వానికి అవసరమైన సాయం చేయండని డిమాండ్ చేయి. అంతేకానీ..కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో బలిదానాలు ఏంటంటూ తిక్క ప్రశ్నలు వేస్తూ కపట ప్రేమ చూపెట్టకు. హైదరాబాద్ లో ఉంటే ఏ విధంగా నువ్వు మాట్లాడుతావో.. తెలంగాణ పొలిమేర దాటగానే ఏ విధంగా మాట్లాడుతావో అందరికీ తెలుసు.

తెలంగాణ వాళ్ల మీద ఏదో స్వచ్ఛమైన ప్రేమ ఉన్నట్లు బిల్డప్ లు ఇవ్వకు పవన్. నీకు అది సూట్ కాదు. నిలువెల్లా ఆంధ్రా పక్షపాతివి నువ్వు. ఎన్నికల ప్రచారంలో తెలంగాణపై ఎంతలా విషం కక్కింది.. ఇక్కడి ప్రజలు మర్చిపోరు. నీ కపట ప్రేమను అంతా ఓ కంట గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన నీకు.. తెలంగాణపై.. ఇక్కడి ఉద్యోగులు, కార్మికులపై మాట్లాడే అర్హత లేదు. ఏపీకి వెళ్లి నీ చంద్రబాబు భజన చేసుకో తెలంగాణ రాజకీయాలు, ఉద్యమాల్లో వేలు పెట్టాలని చూడకు పవనాలు.