నదుల అనుసంధానం దోపీడీయా లక్ష్మణ్.

 

  • నదుల అనుసంధానం దోపీడీయా లక్ష్మణ్.
  • బీజేపీ లక్ష్మణ్ అది నోరా మూసీ మోరా?.
  • గోదావరి-కృష్ణా అనుసంధానంతో తెలుగు రాష్ట్రాలు…
  • బాగుపడటం మీకు ఇష్టం లేదా లక్ష్మణ్?.
  • ఉమ్మడి ప్రాజెక్ట్ మొదలు కాకముందే దోపీడీ అనడం ఎంత వరకు కరెక్ట్.

కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుంది బీజేపీ నాయకుల వ్యవహారం. పొద్దున లేవగానే ప్రాజెక్టుల మీద అర్థం లేని ఆరోపణలు చేస్తూ అసత్యాలు ప్రచారం చేయడం వీళ్లకు అలవాటు. ఇదే అలవాటుతో అసలు కనీసం ప్రాజెక్ట్ డిజైన్లు కూడా ఫైనల్ కాకముందే.. దోపిడీకోసమే అంటూ ఆరోపణలు చేస్తున్నారు. నదుల అనుసంధానంపై బీజేపీ లక్ష్మణ్ చేస్తున్న విమర్శలు చూస్తే.. అర్జెంటుగా ఎర్రగడ్డలో చేర్పించాల్సిందే. గోదావరి-కృష్ణా అనుసంధానంపై ఇప్పటి వరకు ఎటువంటి ఒప్పందాలు జరగలేదు. ప్రాజెక్ట్ ఎక్కడ కట్టి.. ఎంత నీటిని తరలిస్తారో అన్నది కూడా తేల్చలే. కానీ దోచుకునేందుకే.. దోపిడీ చేసేందుకే అంటూ పిచ్చి పట్టిన వాడిలా మాట్లాడుతుండు లక్ష్మణ్.

ఏం తెలుగు రాష్ట్రాలు బాగుపడటం మీకు ఇష్టం లేదా?. రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నావ్. నిత్యం దేశ అభివృద్ధి అంటూ మోడీ బట్టలు చింపుకుంటుండు.. మీ వెర్రి కమలాలు కూడా రోజూ అదే వల్లె వేస్తున్నాయి. మరి ఇదే దేశంలో రాయలసీమ, ఆంధ్రా, తెలంగాణ అనేవి కూడా ఉన్నాయి కదా. ఈ ప్రాంతాల అభివృద్ధి కోసమే.. నీటి కొరత తీర్చడం కోసమే కదా గోదావరి-కృష్ణాను అనుసంధానించాలని ప్రయత్నించేది. ప్రతీ ప్రాంతానికి నీళ్లు అందాలన్న ఉద్దేశంతో నదుల అనుసంధానంపై కేంద్రం నిధులిచ్చి ప్రోత్సహిస్తుంటే.. ఇదేం తెలియని వెర్రి లక్ష్మణ్  మాత్రం పనికిమాలిన విమర్శలు చేస్తున్నాడు.

గోదావరి-కృష్ణా అనుసంధానాన్ని విమర్శిస్తే.. పురుగులు పడిపోతావ్ లక్ష్మణ్. ప్రాజెక్ట్ మొదలు కాకముందే విమర్శిస్తే.. ప్రజలెవ్వరూ హర్షించరు. మీ బీజేపీ సహకరించకున్నా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఐకమత్యంతో.. ఉమ్మడి ప్రాజెక్ట్ ను నిర్మించడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ ఇంచుకు నీరివ్వడం ఖాయం. బీజేపీ నాయకులు అడ్డం పడుకున్నా.. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా.. నదుల అనుసంధానం పూర్తి చేయడం చేసి తీరుతారు. బీజేపీ నాయకులు కేవలం రాజకీయ కోణంలో విమర్శలు చేయడం ఆపి… ప్రజల కోణంలో ఆలోచిస్తే మంచిగుంటది.