కాళేశ్వరంపై అఖిలపక్షం కట్టుకథలు.

 

  • కాళేశ్వరంపై అఖిలపక్షం కట్టుకథలు.
  •  కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇవే విమర్శలు.
  • కాళేశ్వరం పూర్తై నీళ్లు పారుతున్నా.. విమర్శలు మాత్రం మారడం లేదు.
  • అఖిలపక్షం పేరుతో.. ప్రతిపక్ష నేతలు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు.
  • ప్రాజెక్టులు కడుతుంటే.. ఎందుకు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇంకా విమర్శలు మానుకోవడం లేదు అఖిలపక్ష నేతలు. ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు అన్నవ విషయం తెలుసుకోండి. ప్రాజెక్ట్ మొదలు పెట్టిన దగ్గర నుంచి పూర్తై నీళ్లు పారే వరకు అవే విమర్శలు చేస్తుంటే.. ప్రజలు మిమ్మల్ని వెర్రోళ్లు అనుకుంటున్నారు. అఖిలపక్షం పేరుతో ఇంకెన్నాళ్లు డ్రామాలు ఆడుతారని కాళేశ్వరం నుంచి నీళ్లు పొందుతున్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టులో అవినీతి జరిగి ఉంటే నిరూపించండి.. ఆధారాలు చూపించండి అని ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది. కానీ ఒక్క సన్నాసైనా ఆధారాలతో వచ్చాడా?. పోనీ కోర్టులో సవాల్ చేసిన ఒక్క కేసైనా నిలబడిందా?. కేవలం గాలికి విమర్శలు చేసి.. ప్రజల్లో చులకన కావడం తప్ప ఏం సాధిస్తారు.

గ్రావిటీతో నీళ్లు వచ్చేది వదిలిపెట్టి.. వేల కోట్లు ఖర్చు చేసి.. నీళ్లను ఎత్తిపోస్తున్నారంటున్నారు. గ్రావిటీతో నీళ్లు వచ్చే దగ్గర నీటి లభ్యత లేదని కేంద్ర సంస్థ సీడబ్ల్యూసీ తేల్చిందన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారు. ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోయకుండా.. మేమే నీళ్లు తెచ్చామని ప్రభుత్వం ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో… నీటి కొరత లేకుండా పోయింది. గోదావరి వరదతో ప్రాజెక్టులు నిండి వేల టీఎంసీలు సముద్రంపాలు అయ్యాయి. ఒకవేళ వర్షాలు రాకపోతే.. పరిస్థితి ఏంటి?. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ పాలిట సంజీవనిలా మారేది కదా??.

వర్షాలు రాకుండా కరువు ఏర్పడ్డప్పటి పరిస్థితిని అధిగమించాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ దూర దృష్టితో ఆలోచించి.. భవిష్యత్ లో నీటికోసం ఏ ఇబ్బంది రావొద్దన్న ఉద్దేశంతో.. కాళేశ్వరం కట్టడం జరిగింది. పదేళ్ల తర్వాత.. గోదావరి, కృష్ణాలో పెద్దఎత్తున వరద వచ్చింది. అదే ఈ పదేళ్లు.. నీళ్ల కోసం తిప్పలు పడ్డాం. ఆ సమయంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఉండి ఉంటే.. తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది. ఇప్పుడు వరద వస్తుందంటే.. మరో పదేళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. నీళ్లు లేని సమయంలో.. కాళేశ్వరం ప్రాజెక్టే.. తెలంగాణకు జీవనధార అవుతుంది. అప్పుడు కాళేశ్వరం విలువ ఇవాళ విమర్శలు చేస్తున్న వారందరికీ అర్థం అవుతుంది.