కాంగ్రెస్ బీ టీమ్ కోదండరామ్.

 

  • కాంగ్రెస్ బీ టీమ్ కోదండరామ్.
  • కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించాలట.
  • అప్పుడే ప్రజాస్వామ్యం గెలుస్తుందట.
  • కోదండరామ్ చెప్తున్న నీతి వ్యాక్యాలు ఇవి.
  • కోదండరామ్ కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరిగితే బాగుంటుంది.

హుజూర్ నగర్ లో మీ తాతలు దిగొచ్చి ప్రచారం చేసినా గెలిచేది టీఆర్ఎస్ పార్టీయే కోదండరామ్. నువ్వు పొర్లు దండాలు పెట్టి ప్రచారాలు నిర్వహించినా కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారు. కాంగ్రెస్ పదేళ్లుగా ఇక్కడ అధికారంలో ఉండి ఏమీ చెయ్యలేదని టీఆర్ఎస్ వచ్చిన తర్వాతే ఊళ్లు బాగుపడ్డాయని జనంలో ఉంది. అందుకే నిన్నటి సీఎం సభకు స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారు. వర్షంలోనూ ముఖ్యమంత్రి కోసం ఎదురుచూశారు. నిన్న సీఎం సభ జరిగి ఉంటే… ప్రతిపక్షాల సంగతి చూసేవారు. వరుణుడు సహకరించక సీఎం సభ రద్దు అయింది. అయినా.. సోషల్ మీడియా, మీడియా ఇతర మార్గాల ద్వారా సీఎం సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు నేతలు.

సీఎం సభ జరగకున్నా .. హుజూర్ నగర్ లో గెలిచి చూపించి ప్రతిపక్షాలకు చెంపదెబ్బ కొట్టినట్లు హుజూర్ నగర్ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. కోదండరామ్ అండ్ కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం 24న నోళ్లు వెళ్లబట్టడం తప్ప చేసేది ఏమీ ఉండదు. టీఆర్ఎస్ ను ఓడించాలి.. కేసీఆర్ అహంకారానికి బుద్ధి చెప్పాలని కోదండరామ్ ప్రచారం నిర్వహిస్తున్నాడు. అయ్యా కోదండరామ్ ఇవే మాటలు నువ్వు సింగరేణి ఎన్నికల్లో చెప్పావ్. జీహెచ్ఎంసీ, పంచాయతీ, పరిషత్, పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పావ్.. ఎక్కడైనా నీ మాట ఎవరైనా విన్నారా?. టీఆర్ఎస్ కు ప్రజలు ఓట్లు వెయ్యకుండా ఉన్నారా?. నీ మాట ఎక్కడైనా చెల్లుబాటు అయిందా కోదండరామ్. ఇప్పుడు హుజూర్ నగర్ లో ఎలా చెల్తుంది అనుకుంటున్నావ్.

వందమంది కోదండరామ్ లు.. వందమంది కాంగ్రెస్ బీ టీమ్ లు వచ్చి పచ్చి అబద్ధాలతో ప్రచారాలు నిర్వహించినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజల కళ్లముందే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఉన్నాయి. మాటలు ఎవరివి.. చేతలు ఎవరివి అనేది జనం అర్థం చేసుకోగలరు. సో.. కోదండరామ్, కాంగ్రెస్ నాయకులు ఎన్ని చెప్పినా.. ప్రజలు ఎవరికి ఓటు వేయాల్నో ఆల్ రెడీ డిసైడ్ అయ్యారు. మరో వారంలో ప్రజలు తీర్పు బయటకు వస్తుంది. వెయిట్ అండ్ సీ.