కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు కాబట్టే.. హుజూర్ నగర్ అభివృద్ధి అటకెక్కింది

 

  • కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు కాబట్టే.. హుజూర్ నగర్ అభివృద్ధి అటకెక్కింది
  • హుజూర్ నగర్ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ కు ఓటేయాలి
  • హుజూర్ నగర్ అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు
  • ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది
  • తెలంగాణ ప్రజలను ఇబ్బందులు పెడితే ప్రభుత్వం ఊరుకోదు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా… ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా అన్ని రూట్లలో బస్సు సౌకర్యాన్ని కల్పించింది ప్రభుత్వం. పండుగ పూట కాబట్టి.. బస్సుల్లో కొంచెం రద్దీ ఉండటం కామనే. కానీ.. ఎలాగైనా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయాలని అనుకున్న ఆర్టీసీ కార్మికుల కోరిక మాత్రం నెరవేరలేదు. రాష్ట్ర ప్రభుత్వం పండుగ పూట ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో ఆర్టీసీ చేపట్టిన సమ్మె నీరుకారిపోయింది.

సరే.. సమ్మెను పక్కన బెడదాం. ఆర్టీసీ నాయకులు చేస్తున్న సమ్మె హుజూర్ నగర్ ఉప ఎన్నికపై పడుతుంది అంటూ వెలుగు అనే పత్రిక ఓ కథనాన్ని వండి వార్చింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు, ఆర్టీసీ సమ్మెకు ఏమైనా సంబంధం ఉందా? హుజూర్ నగర్ ప్రజలు దశాబ్దాలుగా అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూస్తున్నారు. కానీ.. ఏంలాభం.. ఒక్కరన్నా హుజూర్ నగర్ ను అభివృద్ధి చేశారా? అటువంటి వాళ్లు గెలిచి మాత్రం ఏం లాభం. హుజూర్ నగర్ అభివృద్ధి చెందాలి… మా బతుకులు మారాలి అని ప్రజలు అనుకొని ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే వాళ్లకే లాభం. లేదంటే అదే ఆట.. అదే పాట. కాంగ్రెస్ నాయకుల గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. వాళ్లతోని ఏం కాదు.. అనే విషయం దేశమంతా తెలుసు. ఆ పార్టీకి ప్రెసిడెంటే లేడు. తల లేని మొండెం లాంటి పార్టీ అది. ఆ పార్టీ నాయకులు దశాబ్దాల పాటు తెలంగాణను ఏలి… ఏం చేశారు. ఏం సాధించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కేవలం 5 ఏళ్లలోనే సీఎం కేసీఆర్ ఎంతో చేశారు. దాంట్లో ఒక్క శాతం కూడా వాళ్లు చేయలేకపోయారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే కదా… 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు పాతరేశారు.

ఇప్పుడు హుజూర్ నగర్ లో జరగబోయేది కూడా అదే. కాంగ్రెస్ కంచుకోట అని బావిస్తున్న కాంగ్రెస్ నేతలకు షాక్ ఇస్తూ హుజూర్ నగర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించబోతున్నారు. హుజూర్ నగర్ ప్రజల దశాబ్దాల పాటు కాంగ్రెస్ నేతల పాలనలో ఉన్నారు. కానీ.. ఏం ఒరిగింది.. ఏం ఒరగలేదు. అందుకే.. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని వాళ్లు కూడా పట్టుదలతో ఉన్నారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం అని.. అది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించాలని ఆర్టీసీ నాయకులు చేస్తున్న సమ్మె అని తెలంగాణ మొత్తం తెలుసు. అందుకే.. ఆర్టీసీ సమ్మెకు, హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధమే లేదు.

2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే నేను, నా భార్య రాజకీయ సన్యాసం తీసుకుంటాం.. అని ప్రకటించాడు ఉత్తమ కుమారుడు. కానీ ఏమైంది. 2018 లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయినా కూడా తను మళ్లీ ఎంపీగా పోటీచేశాడు. ఇప్పుడు తన భార్యకు మళ్లీ హుజూర్ నగర్ టికెట్ ఇచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే ఇదేనా ఉత్తమ్. మాట మీదే నిలబడలేని వీళ్లు తెలంగాణను బాగు చేస్తారంటే ఎవరు నమ్ముతారు.. ఎవ్వరూ నమ్మరు.