ఎమ్మెల్సీగా ఏం వెలగబెట్టావ్ మరి నాగేశ్వర్.

 

  • ఎమ్మెల్సీగా ఏం వెలగబెట్టావ్ మరి నాగేశ్వర్.
  • ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు అప్పుడు ఎందుకు ప్రయత్నించలే.
  • ప్రజాప్రతినిధిగా.. ప్రభుత్వానికి తగిన సూచనలు చేసే హోదాలో ఉన్నావ్.
  • ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు అది చేస్తా..
  • ఇది చేస్తా అంటే ఎవరు నమ్ముతారు ప్రొఫెసర్ నాగేశ్వర్.

ఆర్టీసీని చేతకాకుంటే నీకు అప్పగించాల్నా?. నువ్వంత తోపు, తురుంఖాన్ అనుకుంటున్నావా ప్రొఫెసర్ నాగేశ్వర్. నీకంటే మేధావులు ప్రభుత్వంలో ఎవరు లేరనుకుంటున్నావా?. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు.. పేరున్న ప్రజాప్రతినిధులు ఆర్టీసీకి వివిధ హోదాల్లో పనిచేశారు. వాళ్లు చేయలేనిది నువ్వు చేసి చూపిస్తావా?. మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చూపాలి. ఆర్టీసీని ఏళ్ల తరబడి ప్రభుత్వం నడుపుతోంది. ఉద్యోగులు జీతాలు, కార్మికుల వేతనాలు, బస్సుల మెయింటనెన్స్ అన్నీ కలిపితే.. వచ్చేదానికంటే… పోయేదే ఎక్కువ ఉంది. అందుకే ఏటా ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా నష్టాలు తప్ప.. లాభాలు రాలేదు.

తెలంగాణ ఏర్పడిన వెంటనే ప్రతీ బడ్జెట్ లో ఆర్టీసీకి వెయ్యికోట్లు ఇచ్చింది. అలాగే హైదారాబాద్ పరిధిలో నష్టాలు పూడ్చేందుకు జీహెచ్ఎంసీ నుంచి కూడా 100 కోట్లకు పైనే అందిస్తూ వస్తోంది. కానీ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల నిర్లక్ష్య ధోరణితో ఆర్టీసీ నష్టాలే తప్ప లాభాలు రాలేదు. కార్మికులు కోరినంత ఫిట్ మెంట్ ఇచ్చి.. ఐఆర్ ప్రకటించి.. సంస్థను లాభాల్లోకి తీసుకురావాలని కోరితే.. నాలుగేళ్లుగా నష్టాలు పెంచారే తప్ప.. తగ్గించే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వానికి ఇచ్చిన హామీని తుంగలో తొక్కి.. ఇప్పుడేమో జీతాలు పెంచండని ఆందోళనలకు దిగితే ప్రభుత్వం ఏం చేస్తుంది.

ప్రొఫెసర్ నాగేశ్వర్ చదువుకున్న మూర్ఖుడిలెక్క మాట్లాడకు. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేది ఉంటే.. ఐదేళ్లు ఎమ్మెల్సీగా ఉన్నావ్. మండలిలో ఏం చేసినవ్. ప్రభుత్వానికి లాభాలు తెచ్చే నివేదిక ఎందుకు ఇవ్వలేకపోయావ్. ఇప్పుడు నాకివ్వండి లాభాలు తెచ్చి పెడతా అది ఇదీ అని మాట్లాడుతున్నావ్. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏమీ చెయ్యలేదు కానీ.. ఇప్పుడు ఏం చేస్తావ్. కార్మికుల్ని రెచ్చగొట్టేలా ప్రసంగాలు ఆపి.. వాళ్ల గొంతెమ్మ కోర్కెలకు వంత పాడటం మానుకో నాగేశ్వర్.