ఉత్తమ్​..ఉద్యోగ కల్పనకు అడ్డుపడింది మీపార్టీనే కదా..

 

  • ఉత్తమ్​..ఉద్యోగ కల్పనకు అడ్డుపడింది మీపార్టీనే కదా..
  • అయినా యువ‌తకు ఉద్యోగాలిచ్చిన ఏకైక సీఎం కేసీఆర్‌..
  • టీఆరెస్ పాల‌న‌లో భారీగా నోటిఫికేష‌న్లు..
  • ఎక్క‌డ చూసిన పోటీ ప‌రీక్ష‌ల సంద‌డే..
  • కిట‌కిట‌లాడుతున్న కోచింగ్ సెంట‌ర్లు..
అయినా కేసీఆర్‌పై దుష్ప్ర‌చారం చేస్తున్న కాంగ్రెస్​..
ఓవైపేమో ఉద్యోగాలు లేవంటూనే, ఇచ్చిన నోటిఫికేషన్లకు అడ్డుపడిన నీచ చరిత్ర కాంగ్రెస్​ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​రెడ్డి సొంతమని తెలుసుకోకుండా తను అవాకులు చెవాకులు పేలుతున్నాడు. అస‌లు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ క‌ల్పించిన‌న్నీ ఉద్యోగాలు ఎవ‌రూ క‌ల్పించ‌లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  నీళ్లు, నిధులు, నియ‌మాకాలు అనే నినాదంపై కొట్లాడి తెలంగాణాను సాధించిన సీఎం కేసీఆర్.. ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక వేలం సంఖ్యలో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసి నిరుద్యోగుల్లో ఆనందం నింపారు.
స‌మైక్యంలో పోగొట్టిన వార‌స‌త్వ ఉద్యోగాలు స‌హా ఎన్నింటినో అమ‌లుచేశారు. అయితే ఉద్యోగాల క‌ల్ప‌న‌లోనూ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందంటూ కాంగ్రెస్​ మ‌రో నాట‌కానికి తెర‌తీసింది. చంద్ర‌బాబు నాయ‌డు హ‌యంలో సింగ‌రేణిలో మంగ‌ళం పాడిన వార‌స‌త్వ ఉద్యోగాలకు తిరిగి ఊపిరి పోసిన కేసీఆర్ చిత్త‌శుద్ధిని యువ‌త గుర్తించి నెత్తిన పెట్టుకుంది. ఈ ఒక్క విష‌యం చాలు ప్ర‌భుత్వం చెప్పిన ప‌నిని త‌ప్ప‌కుండా నేర‌వేరుస్తుంద‌ని చెప్ప‌డానికి. తొలుత వార‌స‌త్వ ఉద్యోగాలుగా వీటిని క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తే కోర్టులోకేసులు వేసి ప్ర‌తిప‌క్షాలు నిరుద్యోగుల‌కు తీవ్ర అన్యాయం చేశాయి. అయినా వెనుకంజ వేయ‌ని కేసీఆర్ కారుణ్య నియ‌మాకాల పేరుతో నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు క‌ల్పించి మ‌డ‌మ తిప్ప‌ని త‌న నైజాన్ని మ‌రోసారి ప్ర‌దర్శించారు. ఈ విష‌యంలో కేసీఆర్‌పై రాష్ట్రంలో చాలా న‌మ్మ‌కం క‌లిగింది.  విద్యుత్తు ఉద్యోగుల క్ర‌మ‌బద్ధీక‌ర‌ణ‌, పోలీసు కొలువులు, రెవెన్యూ, హ‌స్ట‌ల్ వార్డెన్, గురుకులాలు, డీఎస్సీ, గ్రూప్ ప‌రీక్ష‌లు, తాజాగా పంచాయితీ సెక్ర‌టరీ తదిత‌ర ఎన్నో నోటిపికేష‌న్ల‌తో నిరుద్యోగుల్లో చిరువ‌న‌వులు చిందించారు. టీఎస్‌పీఎస్సీ అధికారిక లెక్క‌ల ప్ర‌కారం ఇప్ప‌టివ‌ర‌కు 80వేల ఉద్యోగాల్ని కేసీఆర్ భ‌ర్తీ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రికొన్ని నోటిఫికేస‌న్ల ద‌శ‌లో ఉన్నాయి. వీటిని ఉద్దేశ్య‌పూర్వకంగా తొక్కిపెడుతున్న కాంగీల పార్టీ కావాల‌నే సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారానికి తెగ‌బ‌డుతోంది.
దాద‌పు రెండు ద‌శాబ్దాల‌కు పైగా సింగ‌రేణిలో నెల‌కొన్న వార‌స‌త్వ ఉద్యోగాలు క‌ల్పించిన కేసీఆర్‌కు రుణ‌ప‌డి ఉంటామ‌ని సింగ‌రేణి ఉద్యోగు సంఘాలు అంటున్నాయి. మ‌రోవైపు ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎన్న‌డూ లేని విధంగా అనేక ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌తో నిరుద్యోగుల నుంచి ఉద్యోగుల మారిన తాము ఈసారి టీఆరెస్‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతామ‌ని కొత్త‌గా ఉద్యోగాల్లో చేరిన యువ‌త పేర్కొంటున్నారు. ఒక‌ప్పుడు నోటిఫికేష‌న్లు లేక ఖాళీగా తిరిగిన తాము కేసీఆర్ ప్ర‌భుత్వం విరివిగి నోటిఫికేష‌న్లు ఇవ్వ‌డంతో పుస్త‌కాల పురుగులుగా మారామ‌ని సెంట్ర‌ల్ లైబ్ర‌రీ, వివిధ యూనివ‌ర్సిటీలు, రాష్ట్రంలోని అనేక కోచింగ్ సెంట‌ర్ల‌లో కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులు పేర్కొంటున్నారు. కాంగీలు ఎన్నికుట్ర‌లు చేసినా తామంతా టీఆరెస్ వెంటేన‌ని ఉద్యోగులు, నిరుద్యోగులు పేర్కొంటున్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై కాంగీలు తమ ద్వంద్వ నీతిని కనబరుస్తున్నాయి. ఇకనైనా ప్రతిపక్షల చేతుల్లో బొమ్మలు కాకుండా ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలు పరీక్షించుకోవాలని ఆర్టీసీ నాయకులకు విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.