ఈసీతో కలిసి ప్రతిపక్షాల కుమ్మక్కు.

 

  • ఈసీతో కలిసి ప్రతిపక్షాల కుమ్మక్కు.
  • టీఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి.
  • కాంగ్రెస్, బీజేపీ కంప్లైంట్ చెయ్యడాలు.. ఏ రాష్ట్రంలో లేని విధంగా..
  • తెలంగాణలో అబ్జర్వర్లు పెట్టడం, ఎస్పీని మార్చడం, అన్నీ చూస్తూనే ఉన్నాం.
  • ఇప్పుడు కొత్తగా కారు గుర్తు కిందే.. కారును పోలిన గుర్తులిచ్చారు.
  • ఓట్లు చీల్చి టీఆర్ఎస్ ను ఓడించాలనే కుట్రలు సాగవు.

గత ఎన్నికల్లో ఏం చేశారో.. ఇప్పుడూ అదే చేసి హుజూర్ నగర్ లో గెలవాలని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి. బీజేపీకి ఎలాగూ బలం లేదు కాబట్టి.. ఉత్తమ్ ఎంపీగా, కేంద్రంలో ఉపయోగపడతాడని భావించి, బీజేపీ ఇంటర్నల్ గా కాంగ్రెస్ కు సహకరిస్తోంది. అందులో భాగంగానే.. అధికార దుర్వినియోగం అని కాంగ్రెస్, బీజేపీ కంప్లైంట్ చేయగానే హుజూర్ నగర్ కోసం ప్రత్యేక అబ్జర్వర్ ను పెట్టారు. ఎస్పీని మార్చారు. తమకు అనుకూలంగా పనిచేసే వారిని నియమించుకున్నారు. అయినా జనంలో.. టీఆర్ఎస్ కే ఎక్కువ మద్దతు ఉండటం.. గులాబీ జెండా ఎగిరే అవకాశాలు ఉండటంతో మరో కుట్రకు తెరలేపారు.

గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తుతో క్రాస్ ఓటింగ్ జరిగి.. ఉత్తమ్ ఎలా గెలిచారో, ఇప్పుడూ అదే పంథా అనుసరిస్తున్నారు. కారు గుర్తు కిందనే కారును పోలిన గుర్తులు వచ్చే విధంగా చేశారు. తద్వారా ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి వేరే గుర్తుకు ఓటేస్తారని చూస్తున్నారు. గతంలో తమకు నష్టం జరుగుతుందని కారును పోలిన గుర్తులను ఎన్నికల్లో ఇవ్వొద్దని కోరినా.. ఈసీ మళ్లీ అదే విధంగా వ్యవహరించడం దేనికి సంకేతం. హుజూర్ నగర్ ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకమై ఏ విధంగా కుట్రలు చేస్తున్నాయో అర్థం అవుతోంది కదా?. ప్రజలారా మీ ఓటే హుజూర్ నగర్ అభివృద్ధికి శాసనం కావాలి. విపక్షాల కుట్రలను భగ్నం చేసి.. భారీ మెజార్టీతో టీఆర్ఎస్ ను గెలిపించండి.

ప్రతిపక్షాలు ఏ విధంగా.. ఎన్ని కుట్రలు చేసి ప్రజా బలం ఉన్న టీఆర్ఎస్ ను ఓడించడం కష్టం. హుజూర్ నగర్ గడ్డపై ఈసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం. సైదిరెడ్డి గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే టీఆర్ఎస్ కు ఓట్ల వర్షం కురిపించబోతోంది. వారం ఓపిక పడితే ఎవరి జాతకం ఏంటో హుజూర్ నగర్ ప్రజలే డిసైడ్ చేస్తారు. వెయిట్ అండ్ సీ.