ఈసారి ఊహించని మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తుంది ఉత్తమ్.

 

  • టీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ బిచాన సర్దే రోజులొచ్చాయి ఉత్తమ్.
  • టీఆర్ఎస్ లో భారీ విస్పోటనం అనేది అంతా నీ భ్రమ.
  • హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం.
  • సిట్టింగ్ ఎమ్మెల్యే నీకే సైదిరెడ్డి ముచ్చెమటలు పట్టించారు.
  • టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో అతి తక్కువ మెజార్టీతో బయటపడ్డావు.
  • ఈసారి ఊహించని మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తుంది ఉత్తమ్.

 

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అడ్డాపై టీఆర్ఎస్ జెండా ఎగరేయడం ఖాయం. స్వయంగా పీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ ఓడితే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండదు.. బతకదు. అందుకే ఉత్తమ్ పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నాడు. లేని పోని ఆరోపణలను టీఆర్ఎస్ పై రుద్దుతున్నాడు. త్వరలో టీఆర్ఎస్ లో భారీ విస్పోటనం జరుగుతుందని సొల్లు కబుర్లు చెబుతున్నాడు. అయితే అటువంటి విస్పోటనాలు జరిగితే.. గిరిగితే.. కాంగ్రెస్ లో జరుగుతాయి. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ లో ఎవ్వరూ మిగలరు ఉత్తమ్.

నీ నిరంకుశ వైఖరి.. నీ చేతగాని నాయకత్వం తట్టుకోలేక ఇప్పటికే పార్టీ ఖాళీ అయింది. 20మంది ఎమ్మెల్యేల్లో నీ దగ్గర ఉన్నది  ఐదుగురు. ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయినప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది ఉత్తమ్. పార్టీ కేడర్ ను, లీడర్లను, ప్రజా ప్రతినిధుల్ని కాపాడుకోలేని దద్దమ్మవు నువ్వు టీఆర్ఎస్ ను విమర్శిస్తున్నావా?. నీకంత సీన్ లేదు గానీ… మూసుకుని కూర్చో ఉత్తమ్. హుజూర్ నగర్ లో నీ కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయ్. నువ్వు లేకపోతే నీ భార్య ఎమ్మెల్యేలు కావాల్నా?. పిల్లలు కూడా లేరు.. ఎందుకు నీకు ఇంత అత్యాశ ఉత్తమ్.

బై ఎలక్షన్స్ లో ఓడిపోతాం అని తెలిసి.. స్థానిక మంత్రి జగదీశ్ రెడ్డి, పోలీసుల కుక్క లెక్క మొరుగుతున్నవ్. ఓటమి భయం నీ గొంతులో స్పష్టంగా కనిపిస్తుంది. నీ భార్యను పెట్టి గెలవాలని చూస్తున్న నీ ఎత్తులు ఇక హుజూర్ నగర్ లో సాగవు. అక్కడ టీఆర్ఎస్ క్యాండెట్ సైదిరెడ్డి గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఉత్తమ్ లాంటోళ్లు వందలమంది వచ్చినా.. ఉత్తమ్ ఇలాఖాలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. కాంగ్రెస్ నాయకులు తలకిందులుగా తపస్సు చేసినా.. జరిగేది ఇదే ఉత్తమ్. ప్రియాంక, రాహుల్, సోనియా లాంటి మహామహులను ప్రచారానికి తీసుకొచ్చినా నీ భార్య గెలవడం అసాధ్యం.