ఆర్టీసీ ఆస్తులకు వచ్చిన ఇబ్బందేం లేదు లక్ష్మణ్.

 

  • ఆర్టీసీ ఆస్తులకు వచ్చిన ఇబ్బందేం లేదు లక్ష్మణ్.
  • ఆర్టీసీ ఆస్తులను ఎవ్వరూ దోచుకోవడం లేదు.
  • నిరుపయోగంగా ఉన్నవి మాత్రమే లీజులకు ఇస్తున్నారు.
  • అది కూడా ఓపెన్ టెండర్లు నిర్వహించి.. పకడ్బందీగా ఇస్తున్నారు.
  • ఆర్టీసీ ఆస్తులు, సమ్మెపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.
  • ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ జోక్యం ఎందుకు లక్ష్మణ్.

ఆర్టీసీ సమ్మె వెనకాల బీజేపీ ఉందన్నది సుస్పష్టం. లేకపోతే.. గవర్నర్ జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందా?. గవర్నర్ జోక్యం చేసుకునేంతలా ఏం జరిగింది. కార్మికులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఒక రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షురాలిని తీసుకొచ్చి గవర్నర్ గా నియమిస్తే.. రాజ్యాంగ హోదా అంటే తెలియనామె ఏం చేస్తుంది. పార్టీ కార్యకర్తలాగే వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి.. ఆదేశాలివ్వడం చూస్తుంటే కేంద్ర డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందనేది క్లియర్ గా అర్థం అవుతోంది.

రాష్ట్రంలో ఏ విధమైన ఆందోళనలు జరిగినా దరిదాపుల్లో కనిపించని బీజేపీ ఇవాళ అన్ని పార్టీల కంటే ముందే మద్దతు ప్రకటించడం.. ధర్నాలు, ఆందోళనలు చేపట్టడం చూస్తుంటే.. కార్మికుల్ని వెనకుండి నడిపించేది, రెచ్చగొట్టేది కమలం వాళ్లేనని తెలుస్తోంది. లక్ష్మణ్ అంగీకరించినా.. అంగీకరించకపోయినా ఇదే వాస్తవం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటోంది. బీజేపీ డ్రామాలన్నీ గమనిస్తూనే ఉంది. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా.. టీఆర్ఎస్ ను ఏమీ చెయ్యలేరు లక్ష్మణ్. అధికార మదంతో ప్రజల్ని రెచ్చగొట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఆర్టీసీని విలీనం చేయాలని, జీతాలు పెంచాలని మాట్లాడే మోతుబరి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విలీనం ఎందుకు చెయ్యరు మరి?. తెలంగాణ కంటే ఎందుకు జీతాలు ఎక్కువ ఇయ్యారు?. లక్ష్మణ్ మీ దగ్గర వీటికి సమాధానం ఉందా?.

ఆర్టీసీ ఆస్తులను దోచేస్తే ఊరుకోవా?. అసలు ఆస్తుల్ని ఎవరు దోచుకుంటున్నారు. ఆర్టీసీ అభివృద్ధిలో భాగంగా ఖాళీగా ఉన్న స్థలాలను లీజుకు ఇవ్వడం జరుగుతోంది. దీనిద్వారా వచ్చే ఆదాయంతో ఆర్టీసీ అప్పుల వడ్డీలైన కట్టొచ్చు కదా?. స్థలాల లీజుల విషయంలో టీఆర్ఎస్ వాళ్లకే ఇస్తున్నారనేది అవాస్తవం. ఓపెన్ టెండర్ల ద్వారా.. ఎవరు ఎక్కువ ధర కోట్ చేస్తే.. వాళ్లకు ఇవ్వడం జరుగుతోంది. నిస్పక్షపాతంగా జరుగుతున్న ఈ విధానంపై బురద జల్లడం మానుకోండి లక్ష్మణ్. ఆర్టీసీని ఎలా పరి రక్షించుకోవాల్నో ప్రభుత్వానికి తెలుసు.. మీరు సైలెంట్ గా ఉండండి చాలు.