ఆత్మహత్యలు ప్రోత్సహించే విధంగా కథనాలు చేస్తున్న వెలుగు పత్రిక..

 

  • ఆత్మహత్యలు ప్రోత్సహించే విధంగా కథనాలు చేస్తున్న వెలుగు పత్రిక..
  • జర్నలిజం విలువలు మరిచి డబ్బున్న రాజకీయనాయకుడి సొంత పుత్రిక లాగే ప్రవర్తిస్తున్న వెలుగు పత్రిక. 
  • ప్రజల్లో అసలు ఆర్టీసీ సమ్మె పై ఊసేలేదు. 
దేశంలోనే అత్యంత ఖరీదైన రాజకీయ నాయకుడి సొంత పత్రిక వెలుగు పత్రిక, ఇంకా ఆర్టీసీ సమ్మె విషయంలో కనీస జర్నలిజం విలువలు మరచి వివేక్ సొంత ఆలోచనలను, కార్యాచరణలను మాత్రమే ప్రచురిస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె పై ఇప్పటికే ప్రతిపక్షాల ఆందోళన వల్ల ఒక కార్మికుడు చనిపోయిన నేపథ్యంలో ఇంకా ఆర్టీసీ కార్మికులు చనిపోవాలని ఉద్దేశంతో ఆత్మహత్యలను ప్రేరేపించే విధంగా ప్రోత్సహించే విధంగా వెలుగు పత్రిక కథనాలు చేస్తుంది.
అసలు నిజానికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఆర్టీసీ సమ్మె గురించి పెద్ద చర్చ కానీ దాని ఊసు కానీ లేనేలేదు.అటువంటి క్రమంలో వెలుగు పత్రిక తెలంగాణ రాష్ట్రంలోని రైతులు,బీడీకార్మికులు కూడా సమ్మెకు సంఘీభావం చేస్తున్నారు అని హాస్యాస్పదంగా కథనాలు చేసింది. రైతులు,బీడీ కార్మికులు ఆర్టీసీ సమ్మెకు ఎందుకు సంఘీభావం చేస్తారు అని తెలంగాణ ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.వాళ్ళ జీవితాలు న్యాయం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నిర్ణయాలు,విధానాలు,పథకాల వల్ల లాభపడ్డ రైతులు,బీడీ కార్మికులు ప్రతిపక్షాలు చేయిస్తున్న ఆర్టీసీ సమ్మెకు ఎందుకు మద్దతు చేస్తారు అని అడుగుతున్నారు.
ఓ వైపు ప్రతిపక్షాలు ఆర్టీసీ సంఘాల మతిలేని మొండిపట్టు తో కార్మికుల ప్రాణాలు పోతున్న కూడా లెక్కచేయకుండా సమ్మె చేస్తున్న తరుణంలో ఆత్మహత్యలను ఇంకా పెంపొందించాలనే క్రమంలో వెలుగు పత్రిక చేస్తున్న కథనాలను ప్రజలు తీవ్రంగా ఎండగడుతున్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంధ్ర పత్రికలు చూపించిన నీతిని ఇప్పుడు వెలుగు పత్రిక కూడా ప్రదర్శిస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెలుగు పత్రికని తెలంగాణ నుండి బ్యాన్ చేస్తే పీడా విరగడవుతుందని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.